![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షోలో పబ్లిక్ బైట్లు మంచి హైలైట్ గా నిలిచాయి. యాంకర్ రష్మీ కమెడియన్ శ్రీవిద్యను పంపించి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ బయటకి పంపించింది. ఐతే రష్మీ మీద రోహిణి మీద పంచులు బాగా పేలాయి. "శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫిమేల్ ఆర్టిస్టుల్లో రోహిణి అంటే ఇష్టం. ఆమె కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆమె కామెడీని ఫ్యామిలీ మొత్తం ఇష్టపడతారు. ఆమెలో ఇవన్నీ ఇష్టమైనవి ఐతే ఆమెలో ఇష్టం లేనిది ఆమె బాగా లావైపోతుంది..
ఆమె కొంచెం తిండి తగ్గించుకోవాలి" అని ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు. తర్వాత శ్రీవిద్య ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్లి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి అందులో రష్మీ గురించి అడిగేసరికి ఆయన చెప్పిన ఆన్సర్స్ విని సెట్ లో అంతా షాకైపోయారు. "కుదిరితే నేను రష్మీని రెండో పెళ్లి చేసుకుంటాను. నాకు రష్మీకి పార్కులో పరిచయం ఉంది. నన్ను పక్కన పెట్టి రష్మీ వేరే వాడితో తిరుగుతోంది. మా ఇద్దరి మధ్య ప్రేమను చెడగొట్టిన ఆ వ్యక్తి గాలోడు" అని చెప్పాడు. ఇక ఆ మాటలు విన్న రష్మీ షాకైపోయింది "అక్కడ గాలోడు..ఇక్కడ పంక్చరోడు.. నా పరిస్థితి ఏంటో" అని ఫీలైపోయింది. తర్వాత ఒక కొబ్బరి బొండాల వ్యాపారి దగ్గరకు వెళ్లి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి అడిగితే "షోలో ఉన్నవాళ్ళంతా పంచులు బాగా వేస్తారు. ఐతే మమ్మల్ని కూడా షోలోకి తీసుకుంటే మేము కూడా వాళ్ళ మీద ఇంకా బాగా పంచులు వేస్తాం.. ఇప్పుడు ఒక పంచ్ వేస్తే మీ షోలో పెట్టుకుంటారు అదే మమ్మల్ని షోలోకి తీసుకుంటే అప్పుడు ఏం పంచులు వేస్తానో చెప్తాను" అన్నాడు. ఒక లేడీ ఐతే ఆది వేసే పంచులు గురించి చెప్పక్కర్లేదు..తెలంగాణ దాటి ఆంధ్ర బోర్డర్ వరకు వెళ్ళిపోతుంది అని చెప్పింది. ఆ తర్వాత ఒక కిరాణా షాప్ వ్యక్తి కూడా ఈ షో గురించి చెప్పాడు. తనకు ఫైమా అంటే ఇస్తామని ఆమె మంచిగా నటిస్తుంది అని చెప్పాడు. తనకు ఫైమా తప్ప రష్మీ ఎవరో తెలీదన్నాడు..ఆ మాటకు రష్మీ ఇమేజ్ డ్యామేజ్ ఐపోయింది.
![]() |
![]() |